విరహం...
విరహం...
ప్రేమ అంటేనే ఇంతేనేమో. నన్ను నీకు దూరంగా
ఉంచి దహించివేస్తుంది ఈ సమయం.
వేకువ ఎప్పుడు అపుతుందా అని ఆత్రంగా
ఈ రేయి తెలవారనంటొంది మనసు మౌనంలో మునిగినట్టు.
నిద్రలో ఆగిపోయిన రాత్రిని చూస్తూ ఉన్నా సూర్యుడి కోసం
ఎంతకీ రాని ఉషోదయం కోసం.నిన్ను చేరాలని తపస్సు చేస్తున్న
ఏదైనా ఆదృశ్యం అయ్యే మంత్రం దొరికితే బావుండు
ఇక్కడ అదృశ్యం అయి నీచెంత చేరేదాన్ని.
నువ్వు కనులు తెరవగానే నీ కళ్ళముందు
ఉండడానికి నిరంతరం నీ ధ్యానంలోనే ఉన్నా
ఆత్మగానయినా గాలినై నిన్ను చుట్టు ముట్టాలని.
నీ ప్రేమ జ్వాలలో ఆవిరవుతున్న నేను.
హిమజ్వాలలా మారి నన్ను చేరుకోవా ప్రియా.
నిద్ర పోవాలని చూస్తుంది ఆకాశం చీకటి కోసం..
నిశీధిలో ఉన్న నా మనసు చూస్తుంది జాబిలి కోసం,
ప్రియతమా క్షేమమేనా.నా కలల కౌగిలిలో ఉన్నది నువ్వే సుమా,
... సిరి ✍️❤️

