ఊసులు
ఊసులు
మణివో మాణిక్యానివో...
రత్నానివో రజతానివో...
వజ్రానివో వైడూర్యానివో...
అద్భుతాలకే అధ్భుతానివో...
ఏమని వర్ణించను నిన్ను...
ఎలా వదులుకోను నీవైపోయిన నన్ను...
కళ్లల్లో కొంటెతనం
చూపులు ఆడే సయ్యాటలు
మాటల్లో మధురోహాలు
మనసులు ఊగే సరదాల ఊయలలు
అణువణువులో అలజడి..
బాసలు నిండిన ఆశల చిలిపి ఊసులు...
... సిరి ✍️❤️

