ఊరుతున్నది
ఊరుతున్నది
పవనమేదో మీటుతున్నది..విరహమేమో ఊరుతున్నది..!
రాగమేదో నలుగుతున్నది..భోగమేమో ఊరుతున్నది..!
చూపలేనిది పాడుతుంటే..గుండెతడియే దాచలేనే..
మేఘమేదో ఉరుముతున్నది..మోహమేమో ఊరుతున్నది..!
మాయకంచెను దాటలేకే..యాతనంతా వరదలాయెను..
స్వప్నమేదో నవ్వుతున్నది..గంధమేమో ఊరుతున్నది..!
ఊరడించే చెలునిచేయే..తలనునిమరగ చేరునెపుడో..
బంధమేదో లాగుతున్నది..సహనమేమో ఊరుతున్నది..!
ప్రేమనదిగా మిగిలిపోయే..భాగ్యమెప్పుడు దక్కునోమరి..
సౌఖ్యమేదో పొంగుతున్నది..శాంతమేమో ఊరుతున్నది..!
నీవునేనను ముచ్చటేగా..ఇప్పుడిక్కడ నాటకముగా..
యాగమేదో జరుగుతున్నది..జ్ఞానమేమో ఊరుతున్నది..!

