STORYMIRROR

Gayatri Tokachichu

Classics

4  

Gayatri Tokachichu

Classics

ఉగాది

ఉగాది

1 min
3


ఉగాది


శార్దూలములు //

1.

ఓ వాసంతవికాసలక్ష్మి !జయ!మా యుల్లంబు రంజిల్లగా 

దైవారాధన జేసి పిల్చితిమి నిన్ దర్షంబుతో గొల్చుచున్ 

దేవీ!క్రోధగుణంబు గాల్చి భువిలో దీపించుమా భాతివై!

శ్రీవాణీ గిరిజా స్వరూప వరదా!శ్రీంకార!కాలాత్మికా!//


2.

ఓ భాస్వంత యుగాది పర్వమ! సదా యుద్ధర్షమందీయుమా!

సౌభాగ్యంబులు నిల్పవమ్మ!నవ వాసంతంబు పొంగారగన్ 

శోభాయాత్రగ క్రోధి వత్సరమ!సంశోభించి మిట్టాడుచున్ 

భూభారంబును తీర్ప రాగదె శుభా!పోద్రోలి కష్టంబులన్.//


3.

పూర్వాచారపరాయణుల్ ప్రణతితో పూజించి నీ రాకకై 

పర్వంబుల్ జరిపించి వేడుకలతో వర్థిల్లి శుద్ధాత్ములై 

సర్వంబీ యుగ ధర్మమంచు జగతిన్ శాంతిన్ బ్రబోధించిరో 

సర్వజ్ఞా! ఘనవర్షమా!జనులకున్ సాంత్వమ్ము నీవీయుమా!//


Rate this content
Log in

Similar telugu poem from Classics