STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

ఉదయరాగం

ఉదయరాగం

1 min
4


ప్రతిరోజు సూర్యోదయాలు, చంద్రోదయాలు ఉదయించడంమామూలే

యుగాలుగా ప్రకృతి వీసమత్తై నా

క్రమం తప్పని నియమాలతోనడుస్తోంది

సాధారణ మానవునికి 

సాధారణంగానే తోయు దినచర్యేఇది


మనసును కన్నులుగా చేసుకొని

ప్రకృతిని ఆవాహన చేసుకుoటే

నీమనోనేత్రానికి వర్ణాల విందులే


భానుని రాకకై ఒద్దికగా తీర్చి

 దిద్దిన పెళ్లి కూతురై

సిగ్గుతో కంది ఎర్రబారిన మొమల్లే 

అరుణవర్ణాన్నిపులుముకున్న తూరుపు

వేకువ వెలుగురేఖల పువ్వై విరిసినవేళ


ప్రశాంత ప్రత్యూషాల ఆహ్లాద వేళలో

లే లేత ఉషాకిరణాల నులివెచ్చని హాయిలో

బుజ్జి పిచ్చుకల కువ కువల్లో

కోకిల కూయని కూసే మధుర గాన లహరిలో

అవని ఆమని పచ్చదనాల పలకరింపులు దృశ్యకావాలౌతుంటే


ప్రాగ్దిశ పై చుక్కల్లా విహంగాలు

 బారులుగా ఎగిరే దృశ్యం


బాలభానుని బంగారు కిరణాల వెల్లువలో

గరిక చివరలపై తుషారాలన్ని 

చమక్ మని ముత్యాలై మెరిసే చిత్రం

చిరుగాలికి చెలియలై ఊగే పత్రకన్యల సోయగాలు

గాలిఊయలలో ఊగి పుడమిని పసుపుతివాచీహత్తుకున్న 

మార్చిపూల వింత సోయగాలు


చేయి తిరిగిన చిత్రకారుని కుంచె దిద్దిన చిత్రంలా

 ప్రకృతి గొంతున ఎన్నెన్నిసుందర రసరమ్య రాగాలో

ప్రకృతి ఎదలో ముద్రితమైన ఎన్నెన్ని వర్ణచిత్రాలో 

ప్రతి రోజు ప్రకృతి సరాగమై ఉదయరాగమై అలపించే

అమధురరాగానికి అంతమెక్కడ..



Rate this content
Log in

Similar telugu poem from Romance