STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

తపస్సు నెరవేరిన వేళ

తపస్సు నెరవేరిన వేళ

1 min
5


గుండె తలపులకు ఎన్ని ఆశలో

గుబులు రేపే ఊహలు ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే


మౌనవించిన హృదిలో ఎన్నిరాగాలో

గుండె గొంతులో కొట్టు మిట్టాడుతూఉంటే


కవ్వించే కనులకు ఎన్ని కలల అలలో

కన్నుల్లో కాటుక రేకలై దిద్ది పోతుంటే


మదిలో ఎగిసిపడే ఆలోచనా తరంగాలేన్నెన్నో

భాష కందని భావాలై ఉరకలేస్తుంటే


ఎద సడిలో ఉవ్వెత్తున లేచిపడే అలజడులెన్నో

జ్ఞాపకాలదొంతరల తీరాన్ని తాకిపోతుంటే


 దాగిన గతానికి ఎన్నెన్ని గాయాల మచ్చలో

మనసు పొరలు కదిలి నెమరేసుకుంటుంటే


 ఎదురు చూపుల వెన్నెల్లో ఎన్ని నిరీక్షణ లో

 తాపసినై తదేక ధ్యానినై నీకోసం


నా తపస్సే ఫలించిన నీవై నిలిచినవేళా

వరించే వరమే నాకై వచ్చినవేళ

ఎప్పుడు నువ్వే నాతో ఉండే

వాసంతపు వనమాలివై

నా జతలో ముడిపడి పోయిన

జన్మల బంధమైపోయావుగా



Rate this content
Log in

Similar telugu poem from Romance