తోబుట్టువులము
తోబుట్టువులము
తోబుట్టువులము
ఒక తల్లి బిడ్డలమై పుట్టినాము
ఒక గూటి పక్షులమై పెరిగినాము
దూరతీరాలలో బ్రతుకుతున్నాము
క్షణం క్షణము తల్చుకొంటున్నాము
మదిలో ప్రేమను మరువము జయ
ఒక పలకరింపుతో నుత్తరము
ఒక ప్రేమ నిండిన యాహ్వానము
మరిచి పోయి మనం జీవిస్తున్నాము
ఘనీభవించి శిలలమైనాము
కాఠిన్యముతో కాలినాము విజయ.
అన్నదమ్ముల యనురాగ బంధము
అక్క చెల్లెళ్ళది యాత్మీయ బంధము
శ్రేయస్సు కోరు చిరకాల బంధము
సాయమై నిల్చు శాశ్వత బంధము
నిలుపు కుంటే యానందము విజయ.
