STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

తన కన్నుల కాటుక

తన కన్నుల కాటుక

1 min
7

తన కన్నుల కాటుకతడి..ఎంత వ్యథకు గురిచేయునొ..!

మనసునెలా తీపి అగ్గి..కడలిలోన ముంచెత్తునొ..! 


ప్రేమకు నిజ సమాధిగా..మార్చేనా నా హృదయం..

తన చూపుల మధువెలాగ..నాఆశలు పండించునొ..!


చరిత్రకే అపురూపత..నింపిన నా కలలరాశి..

పరిమళించు జ్ఞాపకాల..వనములేల వదిలించునొ..!


వెతుకులాట పెంచుతున్న..అలజడికిక అంతమేది..

తన ఒడిలో సేదదీరు..ముచ్చటెపుడు చెల్లించునొ..!


తనపెదవుల నాట్యమాడు..వెలుగురేఖ లేమైనవొ..

ఉన్నచోట ఉన్నదదేదొ..ఉన్నతీరు చూపించునొ..!


తనశ్వాసగ కదలాడే..చైతన్యపు బీజమేదొ..

జన్మమూల రహస్యాల..గ్రంథమేల వ్రాయించునొ..


Rate this content
Log in

Similar telugu poem from Romance