సుదర్శనం
సుదర్శనం
సుదర్శనచక్రము
(ద్విరదగతి రగడ )
హరిహస్త మందు తానాయుధమై మెఱసెను
కరిరాజు మొరవిని మకరినట ఖండించెను
వర యంబరీషునకు బాసటగా నిల్చిన
కరుణను దూర్వాసుని కాపాడి వరమిడిన
స్వామి సేవకుడైన సాధుముని రక్షకుడు
కామితార్థములనిడు కైవల్యదాయకుడు
వేవేల రక్కసుల విభవంబు ద్రుంచెనట!
దేవతాళిని బ్రోవ దిశలనే త్రిప్పునట!
పరమ భక్తులపాలి పరమార్థ తత్త్వమట!
హరికను సైగలతో నావేశ మొందునట!
హరియంతరంగుడే చక్రమై తిరుగునట
హరియించి పాపంబు లాపదలు తీర్చునట!
సుదర్శనమును దల్చ శోకంబే రాదట!
మదయహంకారముల మసటు తొల్గించునట!
జగతి నేలు చక్రము జయచిహ్నమై చెలగు
సుగతినే కల్గించి శోభితము గా వెలుగు//
