స్పర్మాను భూతి..
స్పర్మాను భూతి..
అనుకోని కొన్ని విపత్కర పరిస్థితులు మన మధ్య వచ్చాక...
ఊహించని పరిణామాలు ఎన్నో ఎదుర్కొన్నాక...
ఆ మాటలన్నీ కదిలిపోయే మేఘమాలికల లాంటివని...
మలి సంధ్య వేళ వస్తా అంటూ కబురంపి రాలేక...
ఆ నిశి రాత్రిలో శశి వెలుగులో నువ్వొచ్చినప్పుడు...
ఆ మసక వెలుతురులో...ఆ చిన్న వసారాలో...
నీ ఎద పై సేద తీరుతూ.. నా అలజడులు ఏకరువు పెట్టుకున్నప్పుడు...
నేనెప్పటికీ నీవాడినేగా అని అనునయిస్తూ...
ఏది నీ చీర కుచ్చిళ్ళు లెక్కెట్టి చెప్పనా అంటూ...
తనువు మీటిన నీ ముని వేళ్ళ మధుర గానం మది మరువనే లేదు...
భరోసాతో కూడిన నీ పంటి గాట్ల తీపి గురుతులు ఇంకా మాననే లేదు...
ఆలంబనగా నీ వెంట్రుకలు మోముపై చేసిన చిలిపి గాయాలు తగ్గనే లేదు...
చెమట నీరునే మంచి గంధమై పులుముకున్న మేను పరిమళిస్తూ...
పదే పదే ఒకే స్పర్శానుభూతి కొరుకొంటోంది...
నీ ప్రేమ మాటల్లో చెప్పలేనిదంటూ మురిపాలతో అలవోకగా మురిపించి ...
మన మధ్య జరిగిన సడి లేని సంఘర్షణలకు మౌనంగా ముగింపు పలికి...
నా ఆశకు ఆయువు పోసిన ముద్దు మోమును ఒక్కసారి చూస్తే హాయిగా ఉంటుంది...
మనసుకు కొత్తగా అయిన మధురానుభవంకదా మరి...
- సిరి ✍️

