సంతోషం నీలోనే
సంతోషం నీలోనే
ఆయన ముఖం లో ఏంటి ఆ సౌందర్యం!
ఏంటి ఆ ప్రశాంతత!!
ఇంతకుముందెన్నడూ చూళ్లేదు
ఇంత అందాన్ని, ఇంత ఆనందాన్ని
ఆగట్లేదు నా కన్నీళ్ళు
వెళ్లి ఆయన కాళ్లమీద పడి ఆడిగేసాను
స్వామీ నన్ను కరుణించు
నీ సంతోషాన్ని నాకు కొంచెం భిక్షగా వెయ్యి అని!
పిచ్చిదానా ఖజానా మొత్తం నీ దగ్గర పెట్టుకుని
అడుక్కోడానికి వచ్చావా? అని నవ్వాడు స్వామి
నువ్వే తవ్వుకుని కావల్సినంత తీసుకో! అన్నాడు
ఎంత సిగ్గు చేటు అని తల దించుకుని
తవ్వడం మొదలెట్టాను
- రవీంద్రుని గీతాంజలి ప్రేరణతో
