STORYMIRROR

Midhun babu

Romance Classics Fantasy

3  

Midhun babu

Romance Classics Fantasy

స్నేహమేరా జీవితం

స్నేహమేరా జీవితం

1 min
141


చెలిమికి మేమే నిర్వచనం,

శుభమే పలికింది ఆకాశం.


కలసిన మనసులే

వసంత రూపం,

ఎడబాటెరుగని ప్రేమే సుస్వర జతుల రాగం,

అల్లరి తలపులే

గిలిగింతల మనసునాట్యం,

అంతంలేని అనుబంధమే జన్మలు చేసిన పుణ్యం.


కలవరింతలే ప్రాణమై

విరహమెరుగక సాగేదే మైత్రి బంధం,

కంటిపాపకు నిండుసొగసై

మమతలతో పెనవేసుకున్నదే మా అనురాగం,

అమృతసిరుల స్వచ్ఛ చెలిమికి

మెరుపుల మేఘం అందించే శుభదీవెనం,

సుందరం సుమనోహరం మా స్నేహప్రపంచం.



Rate this content
Log in

Similar telugu poem from Romance