STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

సఖిహృదయమునే

సఖిహృదయమునే

1 min
2

పాఠాలెన్నో నేర్పిన నాచెలి అసలురూపునే చూడనైతినే..!

వేదన తీర్చిన జీవనమాధురి దాగుచోటునే చూడనైతినే..!


జన్మలగోడును ఆవిరిచేసే నిప్పుల వాగున మునిగేదెట్లా..

వలపులవీణియ రాగలేవో నింపుమబ్బునే చూడనైతినే..!


పంజరసౌఖ్యం మరిమరికోరే చిలుకమాయనే వీడేదెట్లా..

ఆశాసౌధపు పునాదిపేల్చగ లోనివెలుగునే చూడనైతినే..!


తొలగని సమాధి కానుక చేసే గురువును చేరే భాగ్యమెప్పుడో.. 

వినయవివేకము లిచ్చే నెచ్చెలి తీపినవ్వునే చూడనైతినే..! 


విరహముకన్నా స్వర్గము లేదను సంగతి తోచేదెన్నడు..

ఒంటరితనమే తనపెన్నిధిగా తెలుపుమెఱుపునే చూడనైతినే..! 


తలపాగాగా అహంకారమే చుట్టుకున్నదే విసరగలేనా..

కరుణాపూరిత మధువునుపంచే సఖిహృదయమునే చూడనైతినే..! 



Rate this content
Log in

Similar telugu poem from Romance