శవ పేటిక
శవ పేటిక
ఎంత బాగ నవ్వుతుందొ..జ్ఞాపకాల శవ పేటిక..!?
ఎన్ని కళలు రువ్వుతుందొ..జ్ఞాపకాల శవ పేటిక..!?
ఎన్ని జన్మలేతీరుగ..ఎత్తిందో లెక్క లేదు..
ఆశలెన్ని పెంచుతుందొ..జ్ఞాపకాల శవ పేటిక..!?
మరపు పూల తోటలోని మధువులకై మదన పడుతు..
ఎన్ని ఆటలాడుతుందొ..జ్ఞాపకాల శవ పేటిక..!?
అంతులేని గాయాలను కష్టంగా మోసేస్తూ..
పాటలెన్ని పాడుతుందొ..జ్ఞాపకాల శవ పేటిక..!?
అలసటలను.. ఆకళ్ళను..తిట్టుకుంటు పడుతు లేస్తు..
ఎన్ని మార్లు చిట్లుతుందొ..జ్ఞాపకాల శవ పేటిక..!?
