శ్రీరామ రఘురామ
శ్రీరామ రఘురామ
సురుచిర వదనునికి సుగంధ లేపనం
కౌసల్య తనయునికి కస్తూరి తిలకం
ఇన వంశ సోమునకు ఇంపైన తిలకం.
రాజీవ నేత్రునికి రతనాల మకుటం
కరుణామూర్తికి కరముల కంకణద్వయం.
శుద్ధచైతన్య రూపునకు ఘన పీతవస్త్రం
నయనాభి రామునికి నవరత్న హారం
మోక్షదాయకునికి మౌక్తిక హారం
దివ్య తేజోమూర్తికి తులసీ మాలా ధారణం
పతిత పావనునికి పరిమళ పుష్పార్చనం
సీతామనో విహారికి శుద్ధ కర్పూర నీరాజనం
వసుధైక నాయకునికి భక్తితో వందనం.
**********
