శ్రీ శోభకృతి
శ్రీ శోభకృతి
*నూతన వత్సరం*
(కవిత )
అదిగదిగో వచ్చింది యామని సౌరభం
ఇదిగిదిగో వినిపించె కలకూజిత గానం
తరువుల నిండుగా పల్లవాంకురం
ధరణిపై విరిసింది నూతన సోయగం
మధుమాసపు మనోహర విలాసం
హృదయరంజితమీ ప్రకృతి వికాసం
శోభకృతు యుగాది యాగమన సంరంభం
జగతిలో ప్రతి యణువూ పులకించినదీ క్షణం
షడ్రుచుల ప్రసాద భక్షణం శాంతి సౌభాగ్య దాయకం
పంచాంగ శ్రవణం పురాణ పఠనం
దివ్య దైవ సందర్శనం సర్వ శుభయోగం
వాడవాడల యందు వేడుకల సంబరం
నాడు నాడులా పట్టరాని సంతోషం
శుభముల నిడు తొట్ట తొలి పండుగ దినం
సర్వ జన సహకార సంయోగ ఫలితం
స్వాగతం!స్వాగతం!శోభకృతూ!
నూతన వత్సరమా స్వాగతం!
అందరికీ ఆనందము నీయుమా!
అందుకొనుమా వందనం!వందనం!
