శివ స్తుతి
శివ స్తుతి
పరమేశా!వినవయ్య!నాదు మొరలన్ బ్రార్థింతు నీ సన్నిధిన్
శిరమున్ వంచుచు నిల్చి యుంటి వరదా!
శ్రేయంబు మాకీయుమా!విరులన్ దెచ్చితి నీదు పూజకొఱకై ప్రీతిన్ కటాక్షింపుమా!
గరిమన్ జూపుమ!చంద్రచూడధరుడా!కారుణ్య వారానిధీ!
