సౌందర్య లహరి
సౌందర్య లహరి
వరాలకూచి సుగుణాలరాశి కనిపించగా
మొలకెత్తి వికసించే కోరికలపుంజి
మనోహరమై మనోరవములో వినిపించగా
కలిగించె అనుభూతిని నాతి అపరంజిం
నీతామర ఓష్ట్యములా మకరందం శ్రీబ్రహ్మం సుర్లోకం
కంటినేను నీ కన్నుల పాలకడలి వైష్ణవునీ వైకుంఠం
నీదుజడా మల్లెలా మద్యములో శివలింగము కైలాసము
ముల్లోకాలు ఆపైనా మూర్తినీవు గోలోకా రాధనీవు
బ్రహ్మవిష్ణు మహేశ్వరం నారాయణి నానెచ్చలి
సారస్వతి లక్ష్మి శక్తి త్రిమూర్తులా ఆరాధిని
కుబుసమిడిచి పెట్టువేళ ఆదిశేశు అవతారం
మనసువిప్పి మాటాడగ విరులతేనె మకరందం
నీడమాయ నిజరూపము దానికదే అపురూపం
మరునిమాయ మహితమందు చెలరేగే రతిరూపం
నాగుండెను ఆలయాన ప్రతిష్ఠించ సమ్మతమే
నినుమెచ్చిన నామదితో చెలిమిచేయ విన్నపము
