STORYMIRROR

Midhun babu

Romance Inspirational Others

4  

Midhun babu

Romance Inspirational Others

రుతురాగలు

రుతురాగలు

1 min
280

నునువెచ్చని గీష్మాలు ఎగిసే పరితాపాలు

వాసంత వికాసాలు పూరాగ విలాసాలు

చలిచలిగ వణికించే పవనాలు శీతలరాగాలు

వర్షాలు హర్షాలు తుఫానులు సునామీలు

బుతురాగాలు ప్రకృతి ప్రసాదితాలు 

సృష్టి కల్పించు వింత వింత లీలలు 


వసంత రాగం గానం ఆగిపోయె

గీష్మ తాపం ప్రతాపం మొదలాయె

ఇది ప్రకృతిమాత సు సరాగమాయె

జీవితం ఎండావానల సంగమమాయె


వేసవి బొండు మల్లెల పరాగం

ఆగని కొత్త దంపతుల సరాగం


అమ్మమ్మ ఇంటి పయనాలు మేనత్తల మమకారాలు

వేసవిశెలవుల ఆటలు దూకుడుబావి స్నానాలు

ఏమైపాయె ఆ తీయని రోజులు


ఆకుపచ్చని అరిటాకు

పసుపుపచ్చని ముద్దపప్పు

తెల్లని వెన్నెలంటి వేడన్నం

మండేఎండల్లె ఎర్రని మాగాయ

తోడుగా అరచెయ్యంత నెయ్యిధార


అదృష్టమంటే తెలుగోడిదే

నోటి జిహ్వనుతీర్చే కాలమంటే

నిజంగా గీష్మాల నిప్పుల గాడ్పుల ఎండాకాలమే....


ఫలరాజ మామిడి తీయందనాలు

నూజివీటి రసాల అమృతపానీయాలు

తాటిముంజల చలువ చందమామలు

కాలపురుషుని మహిమ మనిషి భాగ్యసీమ


ఆ ఆకురాల్చిన మహావృక్షాలు

అవి జీవనతత్వం పాడుతున్న వేమన్న పద్యాలు

ఈ ఎండినమోడుల చిగురింతలు

అవి వీరబ్రహ్మంగారు బోధిస్తున్న కాలజ్ఞాన తత్వాలు

మండేఎండల్లో కాలేకడుపుల నింపే శ్రమజీవుల

చెమటచుక్కలు .... ఉడికే కాయానికి మంచిగంధ లేపనాలు


మండే సూర్యుని తాపాన్ని దాహాన్ని

మట్టికుండల్లో చల్లని నీరు తీర్చిన

భూమాత మట్టితల్లి కి ఎంత మమకారమో

వేయి వింజామరల మల్లెల సౌరభమ్ముల కెందుకింత

దయార్థ హృదయమో ! ఔరా !

ప్రకృతిమాత తన శిశువు మానవుని ఎంత లాలించనో


ఈ జీవనతరంగాలు ఈ ఋతురాగాలు

మనిషిని నిమ్మలంగా బతకమని

ఆ దేవదేవుడిచ్చిన వరాలేమో జీవన ఫలలేమ


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance