STORYMIRROR

Sneha Sneha

Inspirational Others

4.5  

Sneha Sneha

Inspirational Others

రెండు హృదయాల స్పందన...

రెండు హృదయాల స్పందన...

1 min
6

రెండు హృదయాలు... వేరు వేరు దేహాల్లో
కానీ ఒకే రాగం  ఒకే తాళం లో  మ్రోగుతాయి.....

ఒకటి నిశ్శబ్దంలో తపించగా
ఇంకొకటి ఆ నిశ్శబ్దాన్నే ఆలాపన గా చేరుతుంది.....

గాలిలో తేలే ప్రతి ఊపిరి
రెండు హృదయల  మధ్య ఉన్న ఆ అనుబంధానికి సాక్ష్యం......

మాటలు లేకపోయినా అర్థం చేరింది
తాకలేకపోయినా హృదయం తాకింది......


రాత్రి ఆకాశ నక్షత్రాలు వీరి కధ విన్నాయి
చంద్రుడు వారి స్పందనకు రాగం వాయించాడు.....


ఆ రెండు హృదయాలు మెల్లగా కలిసిన క్షణం
ప్రపంచం ఆగిపోయినట్టుంది... సమయం కూడా వినిపించింది....

ప్రతి హృదయ మ్రోగు వెనుక ఒక భావం
ప్రతి నిశ్వాస వెనుక ఒక జ్ఞాపకం....

అది ప్రేమ రూపం కాదు ప్రేమ స్వరమే...
రెండు ఆత్మల మధ్య పుట్టిన సంగీతం.....

రెండు హృదయాల స్పందన
ఒకే రాగంలో మ్రోగిన ఆత్మల మంత్రం

ఒకే జ్ఞాపకంగా నిలిచిన ప్రేమ క్షణం
వారిద్దరూ కలిసిన చోట

జీవితం ఒక కవిత అయింది…
రెండు   మనసులు  ఊపిరి తీయగానే
మరొక  మనసుకి అది రాగమవుతుంది

ప్రేమ అనే అగ్ని జ్వాలలో
రెండు శ్వాసలు కలిసిపోతే
శబ్దం కాదు
ఆనందపు ప్రతిధ్వని వినిపిస్తుంది.....

విడిగా కొట్టుకున్నా గుండెలు
మనసు మాత్రం ఒకటే రాగం

మనసులు  వేరేయినా  ప్రాణం ఒక్కటే
పీల్చే గాలి వేరయినా  ఆత్మ ఒక్కటే
రెండు హృదయాలు వేరయినా  ప్రేమ ఒక్కటే
రెండు హృదయలు  వేరయినా మాట ఒక్కటే


Written by sneha.....


Rate this content
Log in

Similar telugu poem from Inspirational