కాగితపు హృదయం......
కాగితపు హృదయం......
మనసు పలకని ఎన్నో సున్నితమైన భావాలు
కాగితంపై పదాలై జారుతుంటే.......
సూర్యుడు తన కిరణాలతో మంచు పొరలను తాకిన క్షణంలా నెమలి పురి విప్పి నాట్యం చేసినట్టు ఆలోచనలు రంగుల చినుకులయి చిందుతు........
మంచు పువ్వుల కరిగి కాగితపు హృదయం పై రంగుల కలలయి ముత్యపు నవ్వుల పదాలు సందడి చేస్తాయి......
మనసు పొరల్లో మిగిలిపోయిన భావాలు సిరిసిరి మువ్వలా మెరుపులై పదాల అల్లికలో సాయం సాయంత్రం వేళ పూసే సన్న జాజి పరిమళంలా నిశ్శబ్దాన్ని పరవశింపజేస్తాయి.....
కాగితపు హృదయం మీద అలలుగా ఎగిసి పడే భావాలు
తీరపు కెరటాలు తాకినట్టుగా మృదువుగా మనసుని తాకి వెనక్కి జారుతాయి......
వీణలు మోగిన సంగీతపు పదాలు చిరు చిరు ఆశలై కలలై
అక్షరాల మధ్య చోటు చేసుకుని కాగితపు హృదయానికి కొత్త ఊపిరి పోస్తాయి.....
పదాలే ప్రాణమై..... కాగితమే హృదయమై....
భావాలే శాశ్వతమయ్యే..... మౌన ప్రేమ.......
నా కాగితపు హృదయం.....
Sneha......
