"పూలవేదన… జీవనార్థం"
"పూలవేదన… జీవనార్థం"
ఓ రోజూ సాయంత్రం…
ఎవరి పనుల్లో వారు మునిగిపోయి, వచ్చే వాళ్ళు పోయే వాళ్ళు — అంతా సాధారణంగా ఉంది.
ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళ్తూ, పక్కనే ఉన్న గులాబీ చెట్టును చూసి,
“పూలు ఎంతో అందంగా ఉన్నాయి,” అని రెండు పువ్వులు కోసుకున్నాడు.
అందులో ఒక పువ్వు ఆకస్మికంగా నేలపై పడింది — రేగడి రెక్కలు వణికిపోయి, వెన్నంటే జారిపోయింది.
అప్పుడు ఆ పువ్వు తలుపెట్టి ఇలా అన్నది:
"నన్ను చెట్టుకే ఉండనివ్వలేదే!
పెళ్లికి, జడకు, శుభకార్యానికి, పుట్టుకకైనా – ఏదో ఒకటి కోసం వాడేవారు కదా.
వృధాగా తీసుకెళ్లి, ఇలా నేలపాలెయ్యడం ఎందుకు?
నేను ఏ తప్పు చేశానో తెలియదు.
అందంగా కనిపించానని తినేయడానికి తగినదనిపించిందా?
నాకు పెద్ద ఆశలు లేవు —
కాని నేలపాలవడాన్ని మాత్రం ఆశించలేదు…"
అది ఆ పువ్వే అయినా...
ఎందుకో ఓ అడపిల్ల జీవితం కనబడింది…
