పెళ్లి వయసుకా? లేక మనసుకా?
పెళ్లి వయసుకా? లేక మనసుకా?
పెళ్లి అనేది ఎంత గొప్ప బంధమంటారు.
అంత దృఢమైన బంధం ఏర్పడాలంటే, మన మనసుకు నచ్చేవరకు ఆగాలి.
లేదా వయసు అయిపోతుందనే భయంతో ఎవరివారితోనైనా ముడిపడాలా?
అంత గొప్ప బంధం ఏర్పడాలంటే…
మనసుకే నచ్చాలి,
మనసే ఆనందపడాలి.
అప్పుడు దానికి వయసుతో ఎంటి పని?
ఇది నాకు ఎప్పటికీ అర్థం కాదు.
లోకం చెబుతుంది –
వయసు రాగానే పెళ్లి చేసుకోవాలంటారు.
కానీ వయసుకే చేసుకున్న పెళ్లుల్లో ఎన్ని నిజంగా నిలిచాయి?
ఒక మంచి మనిషి దొరికినప్పుడు…
వయసుతో ఎంటి పని?
