పూలగుసగుసలు
పూలగుసగుసలు
పువ్వుల నవ్వులపై
తుమ్మెద ఝమ్మంటు వాలింది
సీతాకోక చిలుక తన
నిశ్శబ్దపు రెక్కలను రెపరెపలాడిస్తు
పలకరించింది !!
తేనె మధురిమలను గ్రోలి
పుప్పొడి రేణువులను
ఇబ్బడిముబ్బడిగా
రెక్కల కంటించుకొని
నలుదిక్కుల వైపు ఎగర బోతున్న
తుమ్మెదతోను సీతాకోక చిలుకతోను
పూలు గుసగుసలాడుతున్నాయి. !!
ఏమా తొందర
నిదానమే ప్రధాన మన్నారు కదా పెద్దలు
క్షేమంగా వెళ్ళి లాభంగా రండి!!
అదిగదిగో
మబ్బులు కమ్ముకుంటున్నాయి
చినుకులే కురిసి
మీ చిరు ప్రాయం ఆయువు తీరు
ఆగి చూడు కొంత సేపు
మెత్తని నా రేకులపై
ఇంకాస్త సేపు సేద తీరిపోదురు !!
అదిగదిగొ
గాలి సుడులు తిరుగుతు
దూసుకొస్తోంది జాలి లేకుండా
ఎగిరి వాలిపోకు ఆగి నాలో ఒదిగిపో!!
ప్రకృతమ్మ బిడ్డలం రూపాలు వేరైనా
మన మనసంతా
హితం కోరే మృధుస్వభావులం
భయం భక్తి భాద్యతల సమహారాల
సమూహం మనది!!
ఒకరికొకరి సహకారం
జగతి ప్రగతికి శ్రీకారం
మనం అనే భావానికి ప్రతీకలమై
పలుకుతున్నాం రేపటి రోజుకు స్వాగతం!!

