ప్రకృతి సిరులు
ప్రకృతి సిరులు
ప్రకృతి సిరులు.
(ఇష్టపదులు )
ప్రకృతిలోని సిరులను ప్రాణంగ కాపాడి
వృక్షజాతులనెల్ల పృథ్విలో పెంచండి!
అడవి పెరుగంగనట నందాల కుసుమాలు
విరజిమ్మగతావులు పులకించు హృదయాలు
చెంగుచెంగున దూకు చిన్నారి కుందేళ్లు
వానరములు రాగా పరిగెత్తు నా లేళ్ళు.
సరసులో మునుగంగ గజరాజ గమనాలు
తెలివితెచ్చుకొన్నవి తెల్లతెల్ల బకాలు.
వడివడిగ నాట్యాలు వానలోన నెమళులు
పులకించనా ప్రకృతి భువిలోన జంతువులు
స్వేచ్ఛగా తిరుగాడి సేదతీరిన చాలు
భగవానుడచ్చోట పరవశముతో వాలు.
చల్లచల్లగా నా సమీరంబులు వీచ
సైరికులు పొలములో సస్యాలు పండించ
గ్రామసింహాలెపుడు కాపుగాయుచు నుండ
ఖరములును,గుర్రాలు కలివిడిగ వెంటుండ
పల్లెలో జనులెల్ల పరమ ప్రీతిగ పెంచు
తల్లి గోమాతలే దాల్మితో కురిపించు
భాగ్యరాసులవాన వసుధలో విలసిల్లు
శాంతి సౌఖ్యములతో జగతియే వర్థిల్లు.//
