ప్రేమంటే..
ప్రేమంటే..
ప్రేమంటే...
నింగీ నేలా కలవటంకాదు
కలవవని తెలిసీ విడిపోయినట్లుండకపోవటం
ప్రేమంటే...
కలువ చంద్రుని చేరటంకాదు
చేరలేమని తెలిసీ తనరాకతో ప్రతిరేయి విరబూయటం..
ప్రేమంటే...
వెలుగూ వానా కలకాలం కలిసి ఉండటంకాదు
కలిసిన క్షణాన ఏడురంగుల హరివిల్లుగా మారటం...
ప్రేమ విఫలమంటే...
విడిపోవడం కాదు
కలిసి ఉండలేకున్నా కలిపేవున్నామనే భావన
విరహంలోనూ వియోగమైనా
మనసున ఒదిగి ఉండటం
గుండెలయగా మారిపోవడం...
... సిరి ✍️❤️

