ప్రేమ
ప్రేమ
మిన్ను ,మన్ను కలిపే,
చిలిపి చినుకు
నిన్ను ,నన్ను కలిపే
తొలిచూపు
మది తలుపులు తట్టే,
వలపు, తలపు
హృదిలో మారు మ్రోగే,
ప్రేమ, పిలుపు
మనసును కదిలించే,
మధురగీతం
పూలలో దాగి ఉన్న.... ,
మకరందం
నింగి నుండి నేలకు జారే,
వెన్నెల జలపాతం
కనులలో దాగిన కమ్మని స్వప్నం
చిరునవ్వులో రాలిన ముత్యం...
... సిరి ✍️❤️

