ప్రేమ లేఖలు
ప్రేమ లేఖలు
ప్రేమలేఖలు పరిహసించే , ...వలపు జాడలు లేవనీ..!
హృదయ సఖితో విభేదించే.., తలపు నీడలు లేవనీ..!
పూలదారిని పరచుకొంటిని..విరహ కంటక మొచ్చెనే ...
గానమేగా ప్రాణమనెనే..ప్రణయ వేడ్కలు లేవనీ....
వాసంతమే మన సొంతమని మది మురిసెనే కొన్నాళ్ళుగా..!
శిశిరవల్లకి చేతికొచ్చే, , రాగ మాడలు లేవనీ...!
వెలుగు నీడలు బ్రతుకు యానము
తెలిసికూడా తాపమే!
లేఖలన్నీ దాచుకొంటిని , చిలిపి మాటలు లేవనీ...!
వడలిపోయే తనువు వెంటే, కదలిపోయే కాలమే!
బెదరిపోయే వార్త వింటిని..వాడ వాడలు లేవన

