STORYMIRROR

Gayatri Tokachichu

Classics

4  

Gayatri Tokachichu

Classics

ప్రాసాక్షరి

ప్రాసాక్షరి

1 min
391

ప్రాసాక్షరి


ప,సి,డి,మ, న,సు.


తేటగీతి మాలిక


నీ (ప)దాబ్జములన్ బట్టి నిల్చి యుండి

గో(ప)కులభూషణా!నిను గొల్తు నెపుడు.

వా(సి)గా పూవులన్ దెచ్చి వాంఛ తీర

నీ (సి)గకు జుట్టి మురిసెద నీరజాక్ష!


వ(డి)వడిగ వచ్చి నీదరి భక్తితోడ

ప(డి)శరణ మంటి గాంచుమా!పరమ పురుష!

తా(మ)సంబగు బుద్ధులే తరుము చుండె

కా(మ )వాసన ద్రుంచుమా కంబుకంఠ!


వి(న)తి మెయి నిను మ్రొక్కెద వినుము మొరలు

ఘ(న) చరిత్రను గలవాడ!కైటభారి!

దా(సు)లన్ బ్రోచు వాడవు దయను జూపు!

వి(సు)వు నొందకు నాపైన వేదవేద్య!


****************************


Rate this content
Log in

Similar telugu poem from Classics