STORYMIRROR

Akshara Lipi

Inspirational

4  

Akshara Lipi

Inspirational

పెనిమిటితో పయనమై

పెనిమిటితో పయనమై

1 min
333

పెనిమిటితో పయనమై , పయనాన్నే చేదాడి ,

కడుపున పసి బిడ్డతో ప్రయాణాన్ని మొదలుపెట్టి,

చెమ్మనిదే చెమట, చిరు రక్తమైనా రాదనీ,

పట్టు పురుగు గా నువ్వు మారే వరకు ,

కళ్ళల్లో కలలు ,కన్నీళ్ళల్లో ఆనందాలు గుట్టలుగా పోసుకుని ,

నీ రాక కోసమై రాకాసి లోకాన్ని మన్నిస్తూ,

మదేమి చెబితే అదే నువ్వనీ ,

నీ పాదాలను ముద్దాడే సమయానికి వేచి చూస్తూ ,

రుణాన్ని రుణంతోనే తీర్చాలని కడుపులోనే తన్నించుకుని,

నీ కోసమే మళ్లీ మళ్లీ మరణించి జన్మిస్తూ,

మరణాన్నే ఎదిరిస్తూ ....కాలమే దారిచూపుతుందనీ నిన్ను సరైన దారిలో నడిపిస్తూ ,

నీ బ్రతుకులో ఎన్నటికీ చీకట్లో ఉంటాననే ప్రతిజ్ఞ చేసి ,

నీ గెలుపును తన గెలుపుగా చూస్తూ,

తన ఆత్మ గౌరవం నీ గుండెల్లో నింపి ,నీ లక్ష్యాన్నిచేరుకోమనే భరోసా ఇస్తూ,

హృదయాన్ని ఒర్చుకోమని చెమ్మగిల్లిన కాదు కాదు అలసిపోయిన తన గుండెకు చెబుతూ, తడారి ,పొడారి ,పలమారి పోయిన కళ్ళల్లో వత్తులకు కన్నీళ్లతో అద్దె కడుతూ ,

జగతికి మూలమేదైనా జన్మనిచ్చేది మాత్రం " అమ్మ" ఒక్కతేనని,

మరణమేదైనా అది నా తర్వాతననే నమ్మకాన్ని కలిగించగలిగే 'ప్రేమ"ను 

ఇవ్వగలిగే ఆ ధైర్యాన్ని నాకు ఇవ్వగలవా " అమ్మ" ...


 





Rate this content
Log in

Similar telugu poem from Inspirational