Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Surekha Shakthi

Tragedy Classics Inspirational

4  

Surekha Shakthi

Tragedy Classics Inspirational

ఓ వనిత నీకు వందనం

ఓ వనిత నీకు వందనం

1 min
290


నాడు ఆదిశక్తి అంశం గా రాక్షసుల గుండెలు చిల్చేను .

నేడు రాక్షసుల చేతిలో రాలిపోతున్నా రేణువులు ఎందరో .

ఓ వనిత నీ ఓర్పుకు వందనం.


నాడు ఆడపిల్ల అమ్మ గర్భంలోనే ఆవిరై పోయేది ఆమె అస్తిత్వం.

నేడు కాలగర్భంలో కరిగిపోతుంది ఆమె అస్తిత్వం.

ఓ వనిత నీ ఓర్పుకు వందనం.


ఆ సృష్టికర్త కూడా శిరస్సు వంచి నమస్కరించేది అమ్మకు మాత్రమే.

కానీ నేటి సమాజంలో శిరస్సు ఎత్తి తిరగలేని స్థితిలో ఉంది ఆ అమ్మ.

ఓ వనిత నీ ఓర్పుకు వందనం.


ప్రేమను పంచి పెంచేది ఆమె

కానీ ఆ ప్రేమను పొందలేక పోతున్నది కూడా ఆమె.

ఓ వనిత నీ ఓర్పుకు వందనం.


మానవ మనుగడకు మూలం ఆమె

కానీ నేడు మౌనంగా మిగిలిపోతుంది 

మాటల తూటాలు తట్టుకుంటూ.

ఓ వనిత నీ ఓర్పుకు వందనం.


ఖరీదైన వస్తువులకు ఇచ్చే విలువ అపారం

కానీ ఖరీదు కట్టలేని అమ్మ ప్రేమని లెక్క చేయరు ఎందుకో.

ఓ వనిత నీ ఓర్పుకు వందనం.

మీ ✍️శక్తి


Rate this content
Log in

Similar telugu poem from Tragedy