STORYMIRROR

Surekha Shakthi

Romance Classics Fantasy

4  

Surekha Shakthi

Romance Classics Fantasy

నువ్వు నేను

నువ్వు నేను

1 min
270

మరో కొత్త రోజు మన కోసం మొదలయింది అని చెప్పకనే చెప్పే నీ మొదటి పలకరింపు.

పసిపాపలా నిశ్చింతగా నీ ఒడిలో నిదురించే నేను

కనురెప్పల మాటున దాగి ఉన్న తియ్యని కల లో ఉండిపోనా . 

కనులు తెరచి కరిగిన కలని తలచి తలచి 

కలత చెందనా.

ఎప్పుడు నా మనసు చూడని కొత్త వింత అనుభూతిని చవి చూస్తున్నా నీ సాంగత్యం లో 

వేల కోట్ల మాటలు ఉన్నా 

మాటలో చెప్పలేని మౌనంగా మిగిలిపోయా. 

నా మౌనం మాటున దాగిన అందమైన మాటలు నీ మనసుకు చేరలేదా .

మబ్బుల మాటున దాగి ఉన్న నీటి సందడి ని

నీకు తెలిపే చిరుగాలి నేనవ్వనా..

ఇంద్రదనసులో రంగులను దోచేసి, తన రెక్కలో దాచుకుని రివ్వున ఎగిరే సీతాకోక చిలుక లా మనం మారిపోదామా .

ఇంద్రధనుస్సులో గూడుకట్టుకొని

చిలుకా గోరింకల్లా సర్వం మరిచిపోదమా!!

మీ ✍️శక్తి


Rate this content
Log in

Similar telugu poem from Romance