ఓ ప్రియతమా...
ఓ ప్రియతమా...
ఓ ప్రియతమా
తెరిచే నా కనులకు
ఉదయం నీ రూపం
చూసే నీ చూపులకు
దాసోహం నా ప్రాణం
మాట్లాడే నీ పెదవులకు
అంకితం నా స్మరణం
పలకరించే నీ కలలకు
కలవరం నా దేహం
కలిపే నీ చేతులకు
ధన్యం నా ప్రాణం
నడిపే నీ అడుగులకు
నేస్తం నా హృదయం
కొలిచే నా ఊహలకు
వరం నీ అనుగ్రహం
పిలిచే నీ ఆలోచనలకు
స్వాగతం నా గతం
వరించే నీ మనసుకు
పరవశం నా జీవితం...
... సిరి ✍️❤️

