ఓ కోరిక
ఓ కోరిక
కనిపిస్తే అడగాలనుంది.
గుండెలోతుల్లో భారం దించుకోవాలనుంది.
వచ్చే ఆలోచల్ని రాకుండా అడ్డుకోవాలి.
దేహాన్ని తేలికగా చేసుకోవాలి.
ఇన్ని రోజులుగా అనుభవిస్తున్నా బాధ
మర్చిపోవాలి.
మోసిన కన్నీళ్ల బరువు దించుకోవాలి.
ఆగి ఆగి కొట్టుకున్నా గుండె చప్పుడు
భయబ్రాంతులు ఆగిపోవాలి.
చీకటి లో కొట్టుమిట్టాడుతున్నా
జీవితానికి కొత్త వెలుగులు రావాలి.
ఎన్నో రోజులుగా దాచుకున్నా బాధ
లావా ల కరిగిపోవాలి.
నిద్రలేని రాత్రులు అనుభావించిన వేదన
కనుమరుగైపోవాలి.
సంతోషం తో గాల్లో తేలిపోవాలి.
అదృష్టం వెతుక్కుంటూ రావాలి.
అలసిన మనస్సు కు హాయి కలగాలి.
చివరి క్షణం ఏ బాధ లేకుండా పోవాలి ప్రాణం.
