STORYMIRROR

Midhun babu

Classics Thriller Others

4  

Midhun babu

Classics Thriller Others

నరకమే

నరకమే

1 min
6

మనిషిలోన వున్నమనిషి అంతమైతె నరకమే

మనసులోన మమతజ్యోతి ఆరిపోతె నరకమే 


సంసారం కడదాకా గడచిపోతె మంచిదే

దంపతుల్లొ సగభాగం ఎడబాసితె నరకమే 


ఆర్జిస్తే నీచుట్టూ భజనపరులు ఎందరో

మలివయసున సంపదంత తరిగిపోతె నరకమే 


పున్నామనరకమంటే ఉందొలేదో "చల్లా"

కన్నకొడుకు తండ్రి మాట వినకపోతె నరకమే 


ఎంతగొప్పవారైనా పదిమందీ మెచ్చాలి

సమాజంలొ మనిషిపరువు నిలవకుంటె నరకమే


Rate this content
Log in

Similar telugu poem from Classics