STORYMIRROR

Gayatri Tokachichu

Classics

4  

Gayatri Tokachichu

Classics

నిరీక్షణ

నిరీక్షణ

1 min
327

*నిరీక్షణ*


(బాల పంచపదులు )


క్షణక్షణము పర్వులెత్తు కాలము

మానసంబున నిత్య సంఘర్షణము

వత్తిడితో నలిగెడి జీవనము

దేనికో? నిట్టూర్పుల నిరీక్షణము

జీవితమంతా నిష్ప్రయోజనం జయా!//


సుఖాలకోసము వెంపర్లాడటము

దక్కలేదని బాధతో నిర్వేదము 

నిరాశలో కూరుకొని పోవటము

నిస్పృహతో జీవితం దుఃఖమయము

చేసుకోవటమే అవివేకం జయా!//


కామ క్రోధ లోభాలన్ జయించటము

సత్యధర్మాచరణ సాధ్యాయనము

నిత్యం క్రొత్త విద్య నేర్చుకోవటము

సంతృప్తియే సౌఖ్యానికి సాధనము

ఇంక దేనికి నిరీక్షణము జయా!//


సమయాన్ని సల్ప సద్వినియోగము

దొరికిన వాటితోడ జీవనము

పరమాత్మ గూర్చి నిత్య చింతనము

సన్మార్గములోన పయనించటము

సఫలీకృతమౌ నిరీక్షణం జయా!//


సత్సంప్రదాయం సన్మార్గ సోపానము

స్థిరమౌ మనస్సే మన వాహనము

ఇంద్రియ నిగ్రహం తోడ సారథ్యము

చేర్చునా పరమాత్మ సన్నిధానము

ముక్తిధామమే మన గమ్యము జయా!//


Rate this content
Log in

Similar telugu poem from Classics