STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

నిన్ను నాలో లేను

నిన్ను నాలో లేను

1 min
2

దృశ్యాల మధ్యనే..పాపనై పోతాను..! 

ఎల్లపుడు నీ కంటి..రెప్పనై పోతాను..! 


వేడుకలు జరిపించు..వాసంతమే నీవు.. 

నీ పెదవి మెఱుపుకే..తీగనై పోతాను..! 


దానమో ధర్మమో..నీ చేతికే తెలుసు.. 

ఇచ్చుటే మరచేటి..ఎముకనై పోతాను..! 


అతిథిగా విచ్చేసి..నవ్వేసి వెళ్ళావు.. 

నీ పాద ధూళిలో..రవ్వనై పోతాను..! 


ఏ వాగు యే కొండ..పైనుండి దూకునో.. 

నీ కొఱకు సెలయేటి..వరదనై పోతాను..! 


ఏ కమల మేవేళ..వికసించి వెలుగునో.. 

నీ కురుల రాగాల..వీణనై పోతాను..! 



Rate this content
Log in

Similar telugu poem from Romance