STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

నిన్ను చూస్తుంటే

నిన్ను చూస్తుంటే

1 min
293

నిన్ను చూస్తుంటే ఆకలుండదు దాహముండదు 

నిన్ను చూస్తుంటే వేరే ఆశ ఉండదు,

ధ్యాస ఉండదు నువ్వు తోడుంటే ... 

కళ్ళు మూసినా నీవే, కళ్ళు తెరిచినా నీవే... 

నిన్ను చూసినరోజు నుంచి మనసంతా నీ ఊసే ...

మెరిసే నీ కళ్ళలో చూస్తున్నా 

నా రూపం బుగ్గలూ ఎరుపెక్కుతున్నాయి 

ఎదురుపడగానే నా ప్రాణం ... 

విరబోసిన కురులు అందంగాఎగురుతున్నాయి.... 

పెదవులు తెల్లని పలువరుసతో మందహసం చేస్తున్నాయి ... 

పరువాలు కౌగిలి కోరుతున్నాయి 

వెచ్చని ఊపిరిలు తనువులను దగ్గర కమ్మంటున్నాయి... 

చెలీ ..! నీవే నా జాబిలి... మనం ఒక్కటి కావాలనే ... 

హృదయంలో అలజడి ...

మన ప్రేమసౌధం కలకాలం నిలవాలని నా ఆశయం

తెలుపవా నీ అంగీకారం చేయక మరింత జాప్యం 

నీ పలుకే అమోఘం నా దరికి నీరాకే

పూర్వం మనజంటే ఈ అవనికి ఆదర్శం..


... సిరి ✍️❤️


Rate this content
Log in

Similar telugu poem from Romance