నీలోనే నేను...
నీలోనే నేను...
నీలోనే నన్ను దాచేస్తావు
నాకే కొత్తగా చూపిస్తుంటావు అప్పుడప్పుడు నాకే ఆశ్చర్యం
నేను కూడా ప్రేమించాన అనేంతలా
ఒక్కసారి మాత్రమే నాలో ప్రవహించిపోయావు నేను మాత్రం జీవితకాలం మునిగిపోయాను
నీవు నా నుంచి వెళ్లిపోతున్నప్పటి కాలాన్ని నాలో బంధించి మరలా మరలా వెతుకుతున్నాను నిన్ను
మరలా నీవు రావని తెలిసి మెదడులోని చోద్యాన్ని ఆకాలపు జ్ఞాపకాన్ని తట్టి తట్టి అడుగుతున్న ప్రశ్న ఒక్కటే ఎన్ని సార్లు అడిగిన అదే ప్రశ్న జవాబు అందని ప్రశ్నగా మిగిలిపోతూ క్షణమైన నన్ను వీడని అతని ప్రేమ నన్ను ఎలా మరించిదని
ఓ కాలమా నీవేమి మాయచేసావో తెలుపవా నీకు వున్నా శక్తి అలాంటిది
గాయాన్ని మాన్ఫగల శక్తి వున్నా నీవు
జీవితకాలం జ్ఞాపకాల గాయాలు రేపుతూనే ఉంటావని తెలిసింది నాకు ఇప్పుడు
..., సిరి ✍️❤️

