నీకు నీవే
నీకు నీవే
మనం చేసే ప్రతీ పనిలో బ్రతుకు బాటను వేసుకుందాం
మనం వేసే ప్రతీబాటలో పూలభవితను పరచుకుందాం
ప్రతీ పుట్టుక చివరివరకూ మంచిపేరుని తెచ్చుకోవలె
జీవితంఅను గ్రంధ పుటలో మంచిచరితను రాసుకుందాం
నీకునీవే శతృవుడిగా మారిపోతే రక్షనెక్కడా
దేశరక్షణ ప్రతినబూనీ వీరగంధం పూసుకుందాం
చివరిదాగా సుఖంగానే సాగిపోద్దా బ్రతుకునౌకా
మంచిచెడులను పడుగుపేకలు కలుపుకుంటూ నేసుకుందాం
ప్రజలకొరకే సేవచేస్తే ఆటుపోటులు సహజమోయీ
పూలురాళ్ళను సంతసంగా సిరసుపైనే పోసుకుందాం

