నీకై...
నీకై...
నా ఆలోచన బాగుంది
నీకై తపన పడుతుంటే...!
దానికై పడే ఆరాటం బాగుంది
నా ఆరాటం నీ మనసు కని తెలిసి...!
నువ్వు చెప్పే పదాల కలయిక బాగుంది
నాకై నువ్వు అక్షరాలను అద్భుతంగా పెర్చుతుంటే...!
చెప్పలేని వేదన బాగుంది నువ్వు ఎదురుపడినప్పుడల్లా
మది మౌనరాగం పాడుతుంటే...!
ఆశల రమ్యత నచ్చింది నా ఆశ నీకై
నీ ఆశ నాకై కదులుతూంటే ...!
సమయ సందార్భాలలో పడిన తికమక నచ్చింది
ఈ వేళలో నీవు ఏమి చేస్తూంటావో అంటూ
పదే పదే అల్లరి చేసే మనసును చూసి నవ్వుకుంటూ ....!
మొత్తం గా కవనం వెనుకున్న
ఊహ గుర్తుకు వచ్చి మధురమైనది నా స్వప్నం
నీ ఊసుతో అది అయింది మాధురాతి మధురం....!!
... సిరి ✍️

