STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

నీ తలపు గగనాలు

నీ తలపు గగనాలు

1 min
4


నీ మనసు పాడుకొను..పద్యమై పోతాను..! 

నా ప్రేమ ప్రకటించు..కావ్యమై పోతాను..! 


పగడాల పెదవింట..జగడాలు మధురమే.. 

నీ చూపు పండించు..రాగమై పోతాను..! 


ఏ ఉలికి అందునో..అపురూప భంగిమలు.. 

ఎనలేని భావాల..శిల్పమై పోతాను..! 


వెన్నెలకు వేడుకే..విరహాల రగిలించ.. 

నీ వేదనను తీర్చు..గంధమై పోతాను..! 


వేదాంత సారమే..వర్షించు ప్రేయసీ.. 

నీ పాద మంజీర..నాదమై పోతాను..! 


కనులతో కథలనే..చెప్పేవు చెప్పకే.. 

నీ తలపు గగనాల..మేఘమై పోతాను..! 


Rate this content
Log in

Similar telugu poem from Romance