నీ మౌనాన్నే
నీ మౌనాన్నే
నీమౌనాన్నే ఊపిరిచేసుకుని బ్రతికేస్తున్నా
నీ మాటలతో పనిలేదు
ఈదూరం నీతీరమని నడుస్తూనేవున్నా
చేరాలన్న ఆశేలేదు
శూన్యంలోనూ నిను చూస్తూనేవున్నా
కనులలో నీరూపు భద్రమే నినుచూడాలని లేదు
చీకటిలోనే నీతోడై జీవిస్తున్నా
వెలుగులో నీతో నడవాలనిలేదు...
నీవు సరదాకి రాసినగీతలే
నాతలరాతగా మార్చుకున్నా
నీవు చేరిపేసిన నీఅడుగులే
నాగమ్యం అనుకుని సాగుతున్నా
నీచేతులతో తుడిచేసిన ఆనందాలే
నాదరి చేరదని దిగులుగానే బ్రతికేసా ఇన్నాళ్ళూ
నాదిశాదశా మార్చుకుంటూ
అణువణువణువూ రగులుతూ
వెలుగులు పంచుతూ
జ్యోతిలా వెలుగుతున్నా
నీరుపోసినా ఆరకుండా పైపైకి ఎగిసిపడుతున్నా...
... సిరి ✍️❤️

