నీ జ్ఞాపకాల
నీ జ్ఞాపకాల
నీ తోడే కరువైతే..పాటపాడు జ్ఞాపకాలు..!
నా ఒంటరితనం తోటి..ఆటలాడు జ్ఞాపకాలు..!
నువు వ్రాసిన లేఖలేమొ..పరిమళించుతున్నాయిగ..
ప్రేమమీర శ్వాసలలో..ఓలలాడు జ్ఞాపకాలు..!
నీలిమబ్బు పల్లకిలో..ఊరేగే ఇంద్రధనువు..
చెలిమిపూల వానలోన..నాట్యమాడు జ్ఞాపకాలు..!
విరహమధువు విందుచేయ..ఎందుకంత ఉబలాటం..
నా మనస్సు మనస్సుతోటి..కోట్లాడు జ్ఞాపకాలు..!
ఆరాటపు అడవిలోన..ఈ నేనుకు గొడవలెన్నొ..
చూడలేని నీడలతోటి..పోరాడు జ్ఞాపకాలు..!

