నేస్తమా నేస్తమా
నేస్తమా నేస్తమా
నేస్తమా......! నేస్తమా..... ! ఓ అమృత హస్తమా.....!!
తెలిసెనే ఇప్పుడే నువ్వు నా సమస్తమా......... !!
ఈ క్షణం మనసే మోడువారిపోయెననుకుంటే.........
తక్షణం నీ తలపే చివురించి హాయిగొలిపేనే............
లోకమే నను అలుసే చేస్తూ అవమానిస్తుంటే...........
ఏకమై ఉందామంటూ ఎనలేని గౌరవమిస్తావే..........
నేస్తమా..... ! నేస్తమా..... ! ఓ అమృత హస్తమా.....!!
తెలిసెనే ఇప్పుడే నువ్వు నా సమస్తమా........ !!
ఎదలోన ఊగిసలాడే సందేహమెందుకు నాలో.........
పదమంటూ నువ్వు పిలిచే పిలుపే పడితే చెవిలో.....
మదిలోని మమతవి నువ్వు నా సంతోషమే కోరేవులే
సడి చేసే నా మదికి సందడులు నేర్పావులే.......
కలగన్నాననుకుంటే...... నిజమై ఎదురొస్తావే.......
కలతగా నేనే ఉంటే...... కలకలం సృష్టిస్తావే........
నేస్తమా......! నేస్తమా..... ! ఓ అమృత హస్తమా.....!!
తెలిసేనే ఇప్పుడే నువ్వు నా సమస్తమా........ !!