నా మనసు...
నా మనసు...
నీకై వేచి ఉన్న నా మనసు నీతో ఏదో
చెప్పాలని చిన్ని ఆశతో ఉంది
చిరుగాలినై నిన్ను చేరాలని ఉంది చెలి
నువ్వు వాడే సుగంధా పౌడర్ నై నిన్ను తాకుతూ
నీ సుతి మెత్తని స్పర్శతో నన్ను తాకుతుంటే
నీ కనుల క్రింది కాటుకనై నిత్యం నిన్నే చూడాలని
నీతోనే ఉండాలని నా మనసు కోరుకుంటుంది
నిన్నెంతగా ప్రేమిస్తున్నాను అని చెప్పాలని ఉంది
కానీ ఆ మాట నిన్ను నా నుంచి దూరం
చేస్తుందని భయం కూడా ఉంది
అందుకనే చెప్పాలా వద్దా అని ఆలోచనలో
సతమతమవుతుంది నా మనసు...
... సిరి ✍️❤️

