నా చెలియ
నా చెలియ


శోభకు శోభలు నింపే..వసంతమే నా చెలియ..!
శిశిరాలను ముద్దాడే..పల్లవమే నా చెలియ..!
ప్రేమకు రెక్కలు తొడిగే..సరాగాల మౌనవీణ..
మదిలోయల తపోమగ్న..కోరకమే నా చెలియ..!
భావాంబర వీధులేలు..నవకోమల లతిక తాను..
అనుభూతుల కావ్యరూప..అక్షరమే నా చెలియ..!
తళుకులీను శక్తిమాటు..చైతన్యపు ధార తనే..
విశ్వరూప వివేకప్రద..ప్రకాశమే నా చెలియ..!
ఈ మాయా నాటకమున..ప్రతిపాత్రన కొలువున్నది..
ఈ నేనుకు సాక్షియైన..ప్రవాహమే నా చెలియ..!
ప్రశ్నించే జిజ్ఞాసకు..ప్రత్యుత్తరమై అందును..
కవనసీమ కతీతమౌ..సునాదమే నా చెలియ..!