STORYMIRROR

Midhun babu

Children Stories Fantasy Children

3  

Midhun babu

Children Stories Fantasy Children

పసిడి బ్రతుకు

పసిడి బ్రతుకు

1 min
139


ప్రేమను పంచేటి అమ్మే 

బ్రతుకు సాగు చేస్తుందిరా,

బంధాలను అల్లుకున్న పంటచేనే నీకు పాన్పుగా మారిందిరా.


పలకరించే ప్రియస్నేహితులే చెట్టుచేమ నీకురా,

ఆదుకునే ఆత్మీయులే పూలుఫలమురా,

తలవంచుకొని శ్రమిస్తే 

తలెత్తుకు బ్రతుకొచ్చురా,

శ్రమను నమ్ముకుంటే 

తలవంచని ఆత్మస్థైర్యమే సంపదగునురా,

బజ్జోరా చిన్నోడా 

విధివ్రాత వినోదాన్నే అమ్మఒడిగా చేసుకొని.


తప్పిపోయిన పసితనాన్ని 

ఆశల హరితవర్ణపు  

లేతచిగురులో చూడరా,

మట్టితోటి అనుబంధమే 

కడవరకు నిలిచేదిరా,

ధరణిసుతుడే చెమటచుక్కను 

తిండి గింజలుగా మార్చు ఇలదేవుడురా,

డబ్బుజబ్బు అహంకారం 

పరిహసించు తలవ్రాతగా భావించకురా,

విషంచిమ్ము స్వార్ధమే నరకాసురుడురా,

నేర్చుకోమని చెప్పే

కాల హితబోధను మరువబోకురా,

సంతోష స్వాగతాలతో సత్యమయ్యేటి పగటికలలతో నిదురపోరా బుజ్జోడా నిదురపో.



Rate this content
Log in