సుఖదుఃఖాల నీడలు
సుఖదుఃఖాల నీడలు


మది జ్ఞాపకాల మూట
మెదడు జ్ఞాపకాల పుట్ట.
గడిచిన కాలంలో కలచి వేసిన బాధలెన్నో
మరచిపోలేని ఊసులెన్నో
అమ్మ ఒడి గతం
అమ్మ ప్రేమ నిత్య నందనం
నాన్న మాట వేద మంత్రం
తోబుట్టువుల బంధం అతి పవిత్రం.
చీకటి వెలుగుల జీవితంలో
.కోరుకున్నవి దొరికితే
అదృష్టం మనుకుంటాం
చేసిన పుణ్యమే వెలుగు బాటలా భావిస్తాం
జరిగిపోయిన జీవితంలో జయాపజయాలు సాధారణం
గడిచిపోయిన గతానికవే వాగ్మూలం.
మంచిగా ఉంటే పూట గడవదు
చేసిన కష్టానికి ఫలితం ఉండదు.
జ్ఞాపకాల అలమారా తెరిస్తే
కొన్ని పాత పుస్త
కాలు
చెపుతాయి జీవిత సత్యాలు
.
కొన్ని పుస్తకాల్లో చెరిగిన అక్షరాలు చెబుతాయి చెదిరిన కలలు
వెలికితీస్తాయి సుఖదుఃఖాల ఆనవాళ్లు
ఆనందాన్నిస్తాయి మధురానుభూతులు
కఠోరమైన కష్టాల జ్ఞాపకాలు మనసును కలచివేస్తాయి .
గతించిన జీవితం తలుచుకుంటే
అమ్మ ఒడి ఒక వరం అనిపిస్తుంది.
అమ్మ లేకుంటే ఈ జీవితం లేదనిపిస్తుంది..
అనుభవించిన తీపి గుర్తులు మూటకట్టి అల్మారా లో ఒక మూల పెట్టి
తాళ మేసినట్టు
మనసును తట్టి లేపుతుంది
గతం గతః అంటూ
మధురానుభూతులు నెమరు వేసుకోమంటుంది.
గుర్తు చేస్తుంది సుఖదుఃఖాల నీడలు