వేణువదే
వేణువదే


సంసారపు సరాగాలు..విందుచేయు వేణువదే..!
సునామీల అలజడులే..రద్దుచేయు వేణువదే..!
సరసస్వర పదలహరుల..సెలయేఱుల మౌనమేదొ..
ఆలోచన దారులనే..అదుపుచేయు వేణువదే..!
వీచుగాలి తరగలింటి..వేదనలను చెల్లించునె..
పసిడి వెలుగు రవాలతో..ముద్దుచేయు వేణువదే..!
చినుకుపూల పల్లకీల..అంతరంగ తరంగిణియె..
వలపులెల్ల కరిగించగ..సద్దుచేయు వేణువదే..!
హృదయలయల సాక్షిగాను..జన్మకథల గంధమేదొ..
రాల్చివేయు సంగతితో..జట్టుచేయు వేణువదే..!
ఈమాయా విశ్వమందు..ఎఱుకమీర కదలాడగ..
జ్ఞానసుధా మాధురితో..మట్టుచేయు వేణువదే..